ENGLISH | TELUGU  
Home  » TV News

లౌక్యం తెలీక 'మగధీర' మూవీ ఛాన్స్ వదులుకున్న అర్చన!

on Jun 29, 2022

అర్చనా శాస్త్రి అలియాస్ వేదా శాస్త్రి అనే పేరు చెప్పగానే ముందు గుర్తొచ్చే మూవీ "నేను". ఇదొక ఇంటరెస్టింగ్ మూవీ. మొద‌ట్లో హీరోయిన్‌గా కొన్ని సినిమాల్లో అల‌రించిన ఆమె, ఆ త‌ర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆడియన్స్ కి వెల్ నోటెడ్ పర్సన్. ఈమె తెలుగు, తమిళ్, కన్నడ మూవీస్ లో యాక్ట్ చేసింది. తర్వాత ఈమె బిగ్ బాస్ సీజన్ వన్ లో కాంటెస్ట్ చేసి  మంచి సందడి చేసింది. ఇప్పుడు అర్చన, జగదీష్ జోడి 'అలీతో సరదాగా' షోకి వచ్చి తన మనసులోని మాటల్ని, బాధల్ని పంచుకుంది. అప్పటివరకు నవ్వినా చివర్లో బాగా ఎమోషన్ అయ్యింది అర్చ‌న‌. ఇప్పుడు ఈ ప్రోమో రిలీజ్ అయ్యింది. 'శ్రీరామదాసు' మూవీ టైములో తనకు పెద్ద ఏజ్ ఏమి లేదని చాలా చిన్న వయసు అని చెప్పింది. "అలా యాక్ట్ చేయగలిగాను అంటే ఆ క్రెడిట్ మొత్తం నా క్లాసికల్ డాన్స్ వల్లనే" అంది అర్చన. 

"రాఘవేంద్రరావు గారితో పని చేయడం చాలా సంతోషంగా ఉంటుంది. సర్.. రాఘవేంద్రరావు గారు మళ్ళీ ఎప్పుడు?" అంటూ ఈ షో ద్వారా అడిగింది. "పెళ్ళికి ముందు ఫ్రెండ్స్ తో పార్టీ కి వెళ్లి, అక్కడినుంచి డైరెక్ట్ గా హాస్పిటల్ కి వెళ్లావట ఏమైంది?" అని అలీ అడిగేసరికి "నేనున్నా కదా నీకు.. నువ్ వెళ్లి ఫుల్ గా ఎంజాయ్ చేయి అని చెప్పాను. కానీ నాకు తెలీదు కదా తన కెపాసిటీ ఎంతో.. ఫుల్ ఐపోయింది. దాంతో ఎమర్జెన్సీ వార్డ్ లో చేర్పించాల్సి వచ్చింది"  అని చెప్పాడు జగదీష్ . 

"బాలయ్య బాబుకి కోరియోగ్రఫీ నేర్పించావట" అనీ అలీ అడిగితే, "బృందావనంలో గోపికలతో డ్యాన్స్ చేసే చిన్న బిట్ ఉంటుంది. అది నేను చెప్తే బాలయ్య గారు చేశారు. దాంతో ఆయన గడ్డం పట్టుకుని సూపర్, బాగా చేసావ్ అని మెచ్చుకున్నార"ని చెప్పింది అర్చన. "యమదొంగలో ఒక  సాంగ్ చేసావ్ కదా.. మరి అదే రాజమౌళి గారి డైరెక్షన్లో 'మగధీర'లో ఒక క్యారెక్టర్ చేయమంటే చేయను అన్నావట" అని అలీ అడిగేసరికి, "అప్పుడు బ్రెయిన్ చిన్నది.. లౌక్యం తక్కువ.. ఇప్పుడు పెరిగింది మెచ్యూరిటీ.. ఒకవేళ 'మగధీర'లో చేసి ఉంటే ఆయన నెక్స్ట్ ఫిలింలో హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చేవారేమో" అంది. 

త‌మ ఇద్దరిలో త‌నే రొమాంటిక్ అని అర్చన చెప్తే, "ఇద్ద‌రిలో అబద్దాలు నేను ఎక్కువగా చెప్తాను" అన్నాడు జగదీశ్. పెద్ద సినిమాల్లో అవకాశం వచ్చి లాస్ట్ మూమెంట్ లో డ్రాప్ అయినవి ఉన్నాయా అని అడిగేసరికి అర్చన ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇలా ఈ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక అర్చనకు 'నేను', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'శ్రీరామదాసు' చిత్రాలు మంచి నేమ్, ఫేమ్ తెచ్చిపెట్టాయి.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.